AP: విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. ఈనెల 16 నుంచి నిరవధిక సమ్మెకు కాంట్రాక్టు కార్మికులు వెళ్లనున్నట్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు నేతలు ప్రకటించారు. గతంలో 1100 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు నిరసనగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రేపు కుర్మన్నపాలెంలో రాస్తారోకో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, యాజమాన్యం దిగి వచ్చే వరకు సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.