TG: బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం వీల్ స్ట్రక్ కావడంతో పైలెట్ శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కు ఏటీసీ అనుమతి కోరాడు. ఏటీసీ అనుమతి ఇవ్వడంతో పైలట్ సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో 119 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.