ఉర్జావీర్‌కు రూ.2,500 నుంచి రూ.15 వేల వరకూ అదనంగా ఆదాయం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు శనివారం పేర్కొన్నారు. "15 రోజుల క్రితం పిలుపునిస్తే వారంలో 12 వేల మంది ఉర్జావీర్‌లు నమోదు చేసుకున్నారు. ఒక్కో ఉర్జావీర్‌కు రూ.2,500 నుంచి రూ.15 వేల వరకూ అదనంగా ఆదాయం వస్తుంది. ఇంటి వద్దే ఉండి ఆదాయం సంపాదించే మార్గాల్లో ఇది ఒకటి. వర్క్ ఫ్రం హోం విధానం అన్ని రంగాల్లో పెరుగుతోంది." అని సీఎం చంద్రబాబు తెలిపారు.