తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో శ్యామలరావు కీలక సూచనలు చేశారు. రథసప్తమి (ఫిబ్రవరి 4) రోజున తిరుమలకు భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో.. ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 3, 4, 5వ తేదీల్లో సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసినట్లు ప్రకటించారు. రథసప్తమి నాడు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో స్పష్టం చేశారు.