AP: ఏలూరు జిల్లాలోని నూజివీడులో షాకింగ్ ఘటన జరిగింది. మిట్టగూడెంలోని మీట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహమ్మద్ జావిద్ (50) అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. విజయవాడ వెళ్లేందుకు మిట్టగూడెంలో బస్సు ఎక్కిన అతను నూజివీడు పట్టణంలోని రాజీవ్ సర్కిల్ వద్దకు వచ్చేసరికి సీటులోనే మృతి చెందాడు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి స్వగ్రామం ఉత్తరప్రదేశ్ గా పోలీసులు గుర్తించారు.