AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోమవారం 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం 10, విజయనగరం 9, శ్రీకాకుళం 8, తూ.గో. 8, అల్లూరి 2 మండలాలు, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో వడగాలులు వీస్తాయని పేర్కొంది. చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే జాగ్రత్తలు పాటించాలని సూచించింది.