లవంగాలను బెల్లంతో కలిపి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తినడం వల్ల దాదాపు 100కు పైగా రోగాలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. లవంగాలు దగ్గు, జలుబుకు దివ్య ఔషదంగా పనిచేస్తాయి. ఈ క్రమంలో బెల్లంతో కలిపి తింటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చట. అలాగే జీర్ణశక్తి మెరుగై, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.