ఇళ్లలోకి పాములు రావడం చాలా మందికి భయాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వారు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. కొన్ని సాధారణ చిట్కాలతో పాములను ఇంట్లోకి రానీయకుండా చేయవచ్చు. ఇంటి చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ చల్లితే పాములు దూరంగా పారిపోతాయి. ఎందుకంటే ఆ వాసన పాములకు అసహ్యంగా ఉంటుంది. అవి పొరపాటున బ్లీచింగ్ తింటే చనిపోతాయి. నిమ్మ మొక్కలను పెంచితే వాటి వాసనకు కొన్ని రకాల పాములు పారిపోతాయి.