ALERT: ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

73చూసినవారు
ALERT: ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
AP: రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాగల మూడు గంటల్లో అన్నమయ్య, తిరుపతి, ఎన్టీఆర్, నంద్యాల, కర్నూలు, అల్లూరి జిల్లాల్లో, గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైతులు, కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్