హాలీవుడ్ నటుడు జీన్ క్లాడ్ వాన్‌డమేపై కేసు నమోదైంది. మోరెల్ బోలియా అనే క్రిమినల్ ముఠా ఈ స్టార్ హీరోకు ఐదుగురు ఆడవాళ్లను గిఫ్ట్‌గా ఇవ్వగా వారిపై జీన్ క్లాడ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో హీరోపై పలు ఫిర్యాదులు అందగా రొమేనియా అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. జీన్ క్లాడ్ వాన్‌డమే.. బ్లడ్‌స్పోర్ట్, కిక్‌బాక్సర్, యూనివర్సల్ సోల్జర్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.