వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డికి న్యాయస్థానం రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. పది రోజలు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పులివెందుల పోలీసులు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం, శనివారాల్లో పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కడప కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వర్రా రవీందర్‌రెడ్డిని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని సూచించింది.