మహిళల సాధికారతకు ప్రధాని మోదీ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చారు. ఎల్‌ఐసీతో కలిసి ‘బీమా సఖి’ అనే స్కీంను లాంచ్ చేశారు. ఈ పథకంలో చేరిన మహిళలకు ప్రభుత్వం ప్రతి నెల రూ.7,000 వరకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఇలా మూడేళ్ల పాటు ఆర్థికసాయం అందిస్తారు. పథకంలో చేరిన వారికి ముందుగా శిక్షణ ఇచ్చి నెల నెల ఆర్థికసాయం అందిస్తారు. పథకంలో చేరడానికి సమీప ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.