ఆసుపత్రి నుంచి నటుడు మోహన్‌బాబు డిశ్చార్జ్‌

52చూసినవారు
ఆసుపత్రి నుంచి నటుడు మోహన్‌బాబు డిశ్చార్జ్‌
సినీ నటుడు మోహన్‌బాబు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మంగళవారం రాత్రి జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం మోహన్‌బాబు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేరారు. ఒళ్లు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారని, వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువభాగంలో గాయమైనట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్