అనకాపల్లి: వైభవంగా బొజ్జన్న కొండ తీర్థం

51చూసినవారు
కనుమ పండుగ సందర్భంగా బుధవారం అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో బొజ్జన్న కొండ తీర్థం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బొజ్జన్నకొండ వద్ద గాలి పటలా పోటీలు నిర్వహించారు. విజేతలకు కూటమి నాయకులు బహుమతుల ప్రధానం చేసారు. ఈ తీర్థంలో రంగుల రాట్నం ఎక్కి రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ ప్రజలను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్