అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ సీఎం రమేష్ ను నక్కపల్లి మండలానికి చెందిన బీజేపీ నాయకులు బుధవారం ఘనంగా సత్కరించారు. నూతన సంవత్సర సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు కోసూరు శ్రీనివాసరావు , జిల్లా ఉపాధ్యక్షులు పోలినాటి నానాజీలు కలిసి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. అలాగే మాడుగుల మండలానికి చెందిన గొల్లపల్లి రాజేష్ తదితరులు కూడా ఎంపీని సత్కరించారు.