అనకాపల్లి పట్టణం గవరపాలెం లో వెలిసిన శ్రీ సంతోషిమాత అమ్మవారిని కరెన్సీ నోట్లతో విశేషంగాఅలంకరించారు.శ్రావణమాసం 2 వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకుని ఉదయంనుంచి అమ్మవారికి ప్రత్యేక కలశ పూజలు, అనంతరం వివిధ రంగుల నోట్ల రూపాయల
దండలతో అలంకరణచేశారు. సాయంత్రం అన్నమాచార్య వాగ్గేయ వరదాయని భక్త బృందం చే మహిళల చే కోలాటాలు, భక్తి గీతాలసంకీర్తన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, పాల్గొన్నారు.