నూతన సంవత్సరంలో అనకాపల్లి జిల్లాకు అంతా మంచే జరుగుతుందని, అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని శాసనమండలి మాజీ సభ్యులు బుద్ద నాగ జగదీశ్ అన్నారు. టీడీపీ అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో బుధవారం జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో టీడీపీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగజగదీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకి ప్రయోజనం జరుగుతుందన్నారు.