కశింకోట మండలం బయ్యవరం గ్రామంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే పీలా, జనసేన నేత రాంకీ పోటీలను మంగళవారం ప్రారంభించారు. జనవరి 3వ తేదీ వరకు పోటీలు జరుగనున్నాయి. అనకాపల్లి జిల్లా నుంచి సుమారు 26 జట్లు పాల్గొంటున్నాయి. జనవరి 4వ తేదీన మొదటి బహుమతిగా రూ. 10 వేలు, 2వ బహుమతిగా రూ. 8 వేలు అందించనున్నట్లు వివరించారు. గొంతిన శ్రీనివాసరావు ఆర్థిక సహకారం అందించారు.