అనంతగిరి: సోషల్ మీడియా ప్రతినిధులపై వేధింపులు ఆపండి

60చూసినవారు
అనంతగిరి: సోషల్ మీడియా ప్రతినిధులపై వేధింపులు ఆపండి
రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించి, వారిని వేధింపులకు గురి చేయడం తగదని అనంతగిరి మండల వైసీపీ ప్రతినిధులు సోమవారం హితవు పలికారు. అక్రమ కేసులు భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి నీలవేణి, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్