అల్లూరి జిల్లా మన్యంలో గిరిజనులు వారం రోజులపాటు నిర్వహించే సంక్రాంతి సంబరాలు ప్రస్తుతం అరకులోయలోని పలు గ్రామాల్లో కొనసాగుతుంది. ఈ సంక్రాంతి పండుగలో భాగంగా గిరిజనులు గిరిజన సాంప్రదాయకంగా బుడియా అనే పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగలో పురుషులు బుడియా నాటకం ప్రదర్శిస్తూ గ్రామాల్లోని ఇంటింటికి పట్టణంలోని ఆయా దుకాణాలకు వెళ్లి(డబ్బులు)బుడియా అడుగుతారు. గిరిజనులు నిర్వహించే సంక్రాంతి పండగ విభిన్నంగా ఉంటుంది.