అరకు: తెరపిచ్చిన వాన
By Neelambar 56చూసినవారుఅల్పపీడన ప్రభావంతో అరకులోయ మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వాన గురువారం మధ్యాహ్నంతో తెరపిచ్చింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వర్ణుడు దర్శనమిచ్చి ఎండ కాయడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. దీంతో అరకులోయలోని సందర్శన ప్రాంతాలైన గిరిజన మ్యూజియం పద్మావతి బొటానికల్ గార్డెన్ రణజిల్లేడ వాటర్ ఫాల్స్ గాలికొండ వ్యూ పాయింట్లలో పర్యాటకుల సందర్శనతో కిటకిట లాడుతున్నాయి.