అరకు: జోరందుకున్న వేసవి వరి పంట పనులు

70చూసినవారు
అరకులోయ మండలంలోని నందిగుడ చొంపి కిక్కిటిగుడ కొత్తవలస పప్పుడువలస తదితర గ్రామాల్లో వేసవి వరి పంట విస్తరంగా సాగు చేస్తున్నారు. గత రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా వరి పంట సాగుకి నీరు పుష్కలంగా ఉండడంతో సుమారు 2 నుంచి 3 వేల ఎకరాల్లో ఆయా గ్రామాల్లో గిరిజన రైతులు వరి పంటలను సాగు చేస్తున్నారు. అయితే కూలీలకు డిమాండ్ పెరగడంతో ఇతర మండలాల నుంచి కూలీలను పిలిపించుకొని వరినట్లు వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్