జి. మాడుగుల మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బొయితెలి గ్రామంలోని పంట పొలాలు కొట్టుకుపోయాయి. ఏడాది వేసిన వరినాట్లు కొట్టుకుపోవడంతో గిరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానిక ఎంపిటిసి అప్పలరాజు టిడిపి యూనిట్ ఇంచార్జ్ లు వెంకట్రావు రమేష్ తెలిపారు. అధికారులు స్పందించి పంట నష్టం వాటిల్లిన రైతులకు పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఆదివారం వారు కోరారు.