కురిడి పరిసర ప్రాంతంలో పిడుగుల శబ్దంతో కూడిన భారీవర్షం

54చూసినవారు
అల్లూరి జిల్లాలోని నైరుతి ప్రభావం కొనసాగుతోంది. డుంబ్రిగుడ మండలంలోని కురిడి కిల్లోగూడ పరిసర ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులు పిడుగుల శబ్దంతో కూడిన భారీ వర్షం కురిసింది. దీనితో కొద్దిరోజులుగా ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు ఉపశమనం లభించింది. అయితే కురుస్తున్న భారీ వర్షాలకు ఖరీఫ్ సీజన్ కావడంతో వ్యవసాయ పనులకు ఎంతో అనుకూలమని ఆయా గ్రామాల గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్