రాబోయే పంచాయతీ సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని మండల యూత్ ప్రెసిడెంట్ గౌరీ శంకర్ కోరారు. మంగళవారం రాత్రి ముంచంగిపుట్టు మండలంలోని దారేల పంచాయతీ పరిధి పేటమాలిపుట్ గ్రామంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గత వైసిపి ప్రభుత్వ హయంలో జరిగిన మేలును ప్రజలకు ప్రతి ఇంటికి వివరించేలా కార్యకర్తల కృషి చేయాలని కోరారు. రాబోయే పంచాయతీ సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు, అభిమానులు అంకితభావంతో పనిచేయాలని కోరారు.