అరకులోయ మండలం పెద్దలబుడు పంచాయతీ పరిధి శరభగుడాలో గురువారం డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణపై అవగాహన కల్పించామని ఏఎంఓ సత్యనారాయణ తెలిపారు. అయన మాట్లాడుతూ టైగర్ దోమ వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని, ఎన్నపిలాస్ దోమ వల్ల మలేరియా వ్యాధి వస్తుందని అన్నారు. గన్నెల మాడగల, సుంకరమెట్ట ఏరియా ఆసుపత్రి పరిధి గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.