కురుస్తున్న వర్షాలకు గూడెంకొత్తవీధి మండలంలోని పలు గ్రామాల్లో నేటికీ కొండ వాగులు పొంగిపొర్లుతూనే ఉన్నాయి. మండలంలోని పెదవలస పంచాయతీ పరిధి బొంతువలసకి వెళ్లే వాగుపై వంతెన లేక బొంతువలస ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం అతికష్టం మీద వాగు దాటి పాఠశాలకు చేరుకున్నారు. వారు మాట్లాడుతూ ఐటిడిఏ పాలకులు స్పందించి బొంతువలస గ్రామానికి వెళ్లే కొండ వాగుపై వంతెన నిర్మాణం చేపట్టి తమ యొక్క కష్టాలు తీర్చాలని కోరారు.