సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆనందపురం పూల మార్కెట్ బుధవారం ఖాళీగా దర్శనమిచ్చింది. ఉత్తరాంధ్రలో అతి పెద్ద పూల మార్కెట్ గా పేరు గాంచిన ఆనందపురం పూల మార్కెట్ కు నలుమూలల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. కానీ పండగ సమయం కావడంతో మార్కెట్ అంతా ఖాళీగా ఉంది. దీంతో రోజురోజుకు పువ్వుల ధరలు తగ్గుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.