భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జిల్లాలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. జిల్లాలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంగళవారం ఆనందపురం మండలం శోఠాం గ్రామంలో ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ భూ సమస్యలకు సంబంధించిన పరిష్కారానికై దరఖాస్తులను ఈ రెవెన్యూ సదస్సులలో చేసుకోవచ్చన్నారు.