సంక్రాంతి ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు అదనంగా 200 బస్సులను సిద్ధం చేశారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, భీమవరం, గుంటూరు, ఖమ్మం వంటి దూర ప్రాంతాలకు నడిపేందుకు గరుడ, గరుడ ప్లస్, అమరావతి, నైట్ రైడర్, క్రూయిజ్, ఆల్ట్రా డీలక్స్లను, జోనల్ పరిధిలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, విజయనగరం, బొబ్బిలి, వంటి ప్రాంతాలకు బస్సులు నడపనున్నామని ఆర్టీసీ అధికారులు మంగళవారం తెలిపారు.