విశాఖ జిల్లా వాసులకు హెచ్చరిక!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం రాత్రికి తుపానుగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. రేపు నెల్లూరు, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు.. కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.