బుచ్చయ్యపేట మండలం ఎల్బిపి అగ్రహారం గ్రామ సర్పంచ్ తమరాన శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం తన స్వగృహంలో కన్నుమూశారు. మూడున్నర సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో అయన విజయం సాధించారు. వైసిపి, కూటమి, నేతలు ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు.