చోడవరం: గంజాయి పట్టివేత.. ఇద్దరు ముద్దాయిలు అరెస్టు

63చూసినవారు
చోడవరం: గంజాయి పట్టివేత.. ఇద్దరు ముద్దాయిలు అరెస్టు
చోడవరం సిఐకి గంజాయి కోసం అందిన సమాచారం ప్రకారం గురువారం గౌరీపట్నం జంక్షన్ వద్ద సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ 31 బిఈ 5783 వ్యాగన్ఆర్ కారులో ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసినట్టు ఎస్సై నావి కార్తీక్ గురువారం సాయంత్రం తెలిపారు. ఆ కారులో ప్రయాణిస్తున్న చింతలపూడి లావణ్య వెంకట సత్య కుమార్, చొప్పా దిలీప్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్