ఈ నెల 8న విశాఖలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చెయలని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు విజ్ఞప్తి చేశారు. మంగళవారం చోడవరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాట్ల గురించి సమీక్షనిర్వహించారు. ఈ కార్యక్రమానికి కో పరిశీలకులుగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగోశ్వరరావు హాజరవగా, జనసేన ఇంచార్జి పీవీఎస్ఎన్ రాజు, బీజేపీ ఇంచార్జి కందర్ప రమణమూర్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మోడీ సభ విజయవంతం చేయాలని కోరారు.