ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, చోడవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చోడవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వంటాకు జగదీష్ బాబు మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ద్వారాపురెడ్డి శ్రీనివాసరావు, సెక్రటరీ వరదా శ్రీను, గౌతమ్ పబ్లిక్ సత్తా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.