చోడవరం వైసీపీ కార్యాలయంలో కరెంట్ చార్జీల పెంపు నిరసనగా "బాదుతున్న కూటమి సర్కార్" పేరుతో పోస్టర్ను మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ బుధవారం విడుదల చేశారు. డిసెంబర్ 27న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీల నిర్వహణతో విద్యుత్ అధికారులకు వినతిపత్రం ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నిరసనను జయప్రదం చేయాలని కార్యకర్తలను కోరారు.