డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బంగారమెట్ట గ్రామంలోని అంబేద్కర్ ఎస్సి కాలనీ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూత్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ యూత్, సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.