చోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం 78వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ ప్రతినిధులకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, జడ్పిటిసిలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.