మూడు నెలల జీతం చెల్లించకపోవడంతో విశాఖ ఉక్కు జనరల్ ఆస్పత్రి కాంట్రాక్ట్ కార్మికులు గురువారం ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడు రమణ ఆందోళనకారులకు సంఘీభావం తెలిపారు. తక్షణం జీతాలు చెల్లించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.