తెలుగు రాష్ట్రాల నుంచి 2006 వ సంవత్సరంలో ఇండియన్ నేవీకి ఎంపిక అయి 15 సంవత్సరాలు భారత నౌకాదళంలో సేవలు అందించి 2021వ సంవత్సరంలో రిటైర్ అయి పలు పలు రంగాల్లో స్థిరపడిన తెలుగు రాష్ట్రాలకు చెందిన నావికులు ఆదివారం విశాఖపట్నంలో రీయూనియన్ అయ్యారు. వారు దేశానికి అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చీఫ్ పెట్టీ ఆఫీసర్ దన్నాన రమేష్ కుమార్ మాట్లాడుతూ తెలుగు యువత అందరూ దేశ రక్షణలో భాగం కావాలని పిలుపునిచ్చారు.