గాజువాక నియోజకవర్గం పెందగంట్యాడలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ నాయుడు గురువారం తెలిపారు. అమరావతినగర్, టింపనీ స్కూల్ ఏరియా, వుడా ఫేజ్-2, భరత్‌నగర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.