’అరవింద్ కేజ్రీవాల్ వంటి నిజాయతీపరుడు, దేశభక్తుడు మరొకరు లేరని రుజువైంది. ఆయన్ను అరెస్టు చేసేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు చేసింది‘ అని మనీశ్ సిసోదియా అన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తోన్న వ్యక్తిని జైల్లో పెట్టారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతకంటే పాపం ఇంకోటి లేదన్నారు. ఈ రోజు సుప్రీంకోర్టు, రాజ్యాంగం, అంబేడ్కర్‌కు సెల్యూట్ చేస్తున్నాను అని తెలిపారు. ఈడీ కేసులో ఆయన విడుదలను అడ్డుకోవడానికి సీబీఐ అరెస్టు చేసిందని సుప్రీంకోర్టుకు అర్థమైందన్నారు.