భారత స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మాడుగుల భారత నిర్మాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయవంతమైంది. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శిబిరాన్ని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. సుమారు 100 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానమని చెబుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.