ఇటీవల నిర్వహించిన నీటి సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గ సభ్యులంతా బాధ్యతగా వ్యవహరిస్తూ.. ఆయకట్టు సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సూచించారు. మంగళవారం చోడవరం క్యాంపు కార్యాలయంలో నియోజవర్గంలోని.. సుమారు 100మంది నీటి సంఘాల అధ్యక్షులను పాలకవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.