మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల దేవరపల్లి చీడికాడ మండలంలో పెదగోగాడ, కొత్త పెంట గ్రామాల్లో మంగళవారం జరిగిన అమ్మవార్ల తీర్థ మహోత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, సీనియర్ నాయకులు పైల ప్రసాద్ రావు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పెద్ద గోగాడలో తీర్థ మహోత్సవం సందర్భంగా ఎడ్ల బండ్లు, పరుగు పందెం పోటిలను ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు.