నాతవరం మండలం యర్రవరం గ్రామం లో శనివారం సాయంత్రం ఘనంగా అయ్యప్ప రథయాత్ర జరిగింది. గ్రామం మొత్తం ఊరేగింపు తో వాయిద్యాలు, బాణాసంచా నడుమ ఈ రథయాత్ర ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన వారందరికీ భిక్ష ఏర్పాటు చేశారు. ఈ రథయాత్రలో చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్పలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.