భారతదేశంలో 75 ఏళ్లలో అవసరాన్ని బట్టి వందసార్లు రాజ్యాంగాన్ని సవరించుకోవడం జరిగిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. బీహార్ రాష్ట్ర పాట్నాలో జరుగుతున్న 85వ అఖిలభారత స్వభాపతుల సదస్సులో సోమవారం స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సవరణ ప్రగతికి ఎదురైన అడ్డంకులను తొలగించుకోవడానికి జరిగిందన్నారు. దీనివల్ల రాజ్యాంగం మరింత బలోపేతం అయిందన్నారు.