ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో జిల్లాలోని చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను, విశిష్టతను తెలిపేలా గురువారం విశాఖ టౌన్ హాల్ నుంచి వివిధ ప్రాంతాల మీదగా హెరిటేజ్ వాక్కు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో బుధవారం ఆయన పోస్టర్ ఆవిష్కరించారు. హెరిటేజ్ బాక్స్ లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణి పాల్గొన్నారు.