పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ను శనివారం రాత్రి విశాఖలోని గ్రాండ్ బే హోటల్ లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మిత్రబృందం ఘనంగా సన్మానించింది. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఎన్నిక కావడం ఉత్తరాంధ్రకు గర్వ కారణమని తెలిపారు.