బంగాళాఖాతంలో బలహీన పడిన అల్పపీడనం

62చూసినవారు
పశ్చిమ మధ్య బంగాళాఖాతం , వాయువు బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అల్పపీడనం క్రమేపీ బలహీనపడుతోంద‌ని విశాఖలోని వాతావ‌ర‌ణ కేంద్రం బుధ‌వారం పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీగాను, చాలాచోట్ల ఓ మోస్త‌రు వర్షాలు ప‌డే అవకాశం ఉంద‌ని తెలిపింది. ఉత్తర కోస్తాలోచాలాచోట్ల మంగ‌ళ‌వారం నుంచి వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని, తెలంగాణ‌లో గురువారం భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

సంబంధిత పోస్ట్